స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2020-2021 జాబ్ క్యాలెండర్

Share the news

-కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మల్టీటాస్కింగ్, ఎల్‌డీసీ, యూడీసీ, స్టెనోగ్రాఫర్, హిందీ ట్రాన్స్‌లేటర్స్, గ్రూప్ బీ, సీ ఆఫీసర్స్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, సీఏపీఎఫ్‌లో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, జూనియర్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి
ప్రకటనలు విడుదల చేసి, రాతపరీక్షలు, స్కిల్‌టెస్ట్/ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తుంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కొలువుల ఖజానాగా పేరుగాంచింది. ఏటా ఇరవైకి పైగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూ భారీ సంఖ్యలో కేంద్ర ప్రభుత్వంలోని కొలువులను భర్తీ చేస్తుంది. ఏటా నిర్వహించే ఆయా పరీక్షల ప్రకటన తేదీలను, పరీక్ష తేదీలను విడుదల చేసింది. జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసిన నేపథ్యంలో ఆయా పరీక్షలకు ప్రిపేరయ్యే వారి కోసం వివరాలు సంక్షిప్తంగా…
👉2019-21 క్యాలెండర్:

-ఎగ్జామినేషన్ ఫర్ సెలక్షన్ పోస్ట్స్ ఫేజ్-VII/2020:
-నోటిఫికేషన్ 2020, జనవరి 17న విడుదలవుతుంది. దరఖాస్తుకు చివరితేదీ 2020, ఫిబ్రవరి 14. పరీక్షతేదీలు-2020, జూన్ 10 నుంచి 12 వరకు.
-ఎస్‌ఐ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సీఏపీఎఫ్‌ఎస్ ఎగ్జామినేషన్-2020 (పేపర్-1):
-నోటిఫికేషన్ విడుదల 2020, ఏప్రిల్ 17. దరఖాస్తుకు చివరితేదీ-2020, మే 16. పరీక్ష తేదీలు- 2020, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు.
-జూనియర్/ సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ హిందీ ప్రధ్యాపక్ ఎగ్జామినేషన్-2020 (పేపర్-1):
-నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 17. దరఖాస్తు దాఖలుకు చివరితేదీ-మే 16, పరీక్షతేదీ 2020, అక్టోబర్ 1.
-మల్టీటాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్-2020 (పేపర్-1):
-నోటిఫికేషన్ విడుదల 2020, జూన్ 2. దరఖాస్తు దాఖలకు చివరితేదీ-2020, జూలై 15. పరీక్షతేదీ 2020, అక్టోబర్ 26 నుంచి నవంబర్ 13 వరకు.
-గ్రేడ్ సీ&డీ స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్-2020:
-నోటిఫికేషన్ విడుదల 2020, ఆగస్టు 4. దరఖాస్తు దాఖలకు చివరితేదీ-సెప్టెంబర్ 3, పరీక్షతేదీ 2020, డిసెంబర్ 1 నుంచి 3 వరకు.
-జూనియర్ ఇంజినీర్: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎగ్జామినేషన్-2020 (పేపర్-1)
-నోటిఫికేషన్ విడుదల 2020, ఆగస్టు 4. దరఖాస్తు దాఖలుకు చివరితేదీ-సెప్టెంబర్ 3. పరీక్షతేదీ 2021, ఫిబ్రవరి.
-సీజీఎల్ ఎగ్జామినేషన్-2020 (టైర్-1):
-నోటిఫికేషన్ విడుదల 2020, సెప్టెంబర్ 15. దరఖాస్తు దాఖలుకు చివరితేదీ-అక్టోబర్ 15. పరీక్షతేదీ తర్వాత ప్రకటిస్తారు.
-సీహెచ్‌ఎస్‌ఎల్ (10+2)-2020 (టైర్-1):
-నోటిఫికేషన్ విడుదల 2020, నవంబర్ 30. దరఖాస్తు దాఖలకు చివరితేదీ-డిసెంబర్ 15. పరీక్షతేదీ తర్వాత ప్రకటిస్తారు.

-వెబ్‌సైట్‌ఐ https://ssc.nic.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enable Notifications    OK No thanks