Site logo

PRTU-TS జమ్మికుంట మండలశాఖ నూతన కార్య ఎన్నిక

తేది : 06-08-2017 ఆదివారం

పాకాల ప్రభాకర్ రెడ్డి 


ప్రోగ్రెసివ్ రికగ్నైజడ్ టీచర్స్ యూనియన్ (PRTU-TS) జమ్మికుంట మండలశాఖ సర్వసభ్య సమావేశము తేది: 06-08-2017 ఆదివారం రోజున స్థానిక బాలుర ఉన్నత పాఠ శాల- జమ్మికుంటలో మండలశాఖ అధ్యక్షులు శ్రీ పాకాల ప్రభాకర్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు జాలి మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఊపాధ్యాయుల ఏకీకృత సర్వీసు సాధనలో PRTU-TS ఎంతో కృషి చేసిందని, CPS విధానం రద్దు , 398 వారికీ నేషనల్ ఇంక్రిమెంట్లు, చైల్డ్ కేర్ లీవు పెంపు, దసరా సెలవుల్లో బదిలీలు మరియు ప్రమోషన్స్ గురించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు .తరువాత నూతన కార్యవర్గాన్ని 2017-19 సం.నకుగాను బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించారు.

ఎన్నికైన జమ్మికుంట శాఖ కార్యవర్గము అధ్యక్షులుగా పాకాల ప్రభాకర్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి టీ. తిరుపతి , అసోసియేట్ అద్యక్షులు ఎ. శ్రీనివాస్ , మహిళా ఊపద్యక్షురాలు ; యల్.విజయలక్ష్మి , కార్యదర్శి ; జి.మధు ,మహిళా కార్యదర్శి ఆర్. సుజాత ప్యానల్ ఘన విజయం సాధించింది .

ఈ ఎన్నికకు సహకరించిన రాష్ట అసోసియేట్ అద్యక్షులు; కె. కేదారిశ్వర్, జిల్లా అసోసియేట్ అద్యక్షులు టీ. వెంకట్రాజం ,జిల్లా కార్యదర్శి; యస్.మహేష్ ,వీశ్రంత ఊద్ద్యోగుల అద్యక్షులు ;యం. రాజమహ్మాద్ , మరియు PRTU-TS ప్రాథమిక సబ్యులకు నూతన కార్యవర్గము కృతజ్ఞతలు తెలీయచేసింది.
ఈ కార్యక్రమములో శ్రీ జిల్లా ప్రధాన కార్యదర్శి ; జాలి .రాఘవరెడ్డి , యస్.మోహన్ రెడ్డి జిల్లా కార్యదర్శి గారు ,హుజురాబాద్ ,శంకరపట్నం, వీణవంక , ఇల్లందకుంట, అద్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు

Comments

  • No comments yet.
  • Add a comment