రాహుల్ గాంధీ అరెస్ట్ కి నిరసనగా యువజన కాంగ్రెస్, NSUI ఆధ్వర్యంలో జమ్మికుంట బస్టాండ్ అవరణలో ధర్నా, రాస్తా రోకో

Share the news

ఈ రోజు సాయంత్రం జమ్మికుంట బస్టాండ్ అవరణలో ధర్నా రాస్తా రోకో యువజన కాంగ్రెస్, NSUI ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి అలాగే యూపీ సీఎం ల దిష్టి బొమ్మ దగ్దం చెయ్యడం జరిగిన తర్వాత ధర్నా రాస్తరోకో చేసి అనంతరం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని రవి , NSUI సెంట్రల్ యూనివర్సిటీ కో ఆర్డినేటర్ సజ్జాద్ మొహమ్మద్ లు మాట్లాడుతూ దళిత మహిళా ను గ్యాంగ్ రేప్ చేసి కామాంధుల దాష్టీకానికి గురైన యువతి అరవకుడదని నాలుక కోసేశారు నడవకుదని వెన్నుముక తుంచేశరు ఇలాంటి దారుణమైన సంఘటన జరిగిన విషయం తెలుసుకున్న వారి కుటంబసభ్యులను పరామర్శించడానికి వెళ్ళిన జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు నిరసిస్తూ దేశ ప్రధాన మంత్రి అలాగే యూపీ సీఎం ల దిష్టి బొమ్మ దగ్దం చెయ్యడం జరిగిన అనంతరం ధర్నా రాస్తరోకో చెయ్యడం జరిగినది గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారి కుటుంబం మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నతమైన యావత్ ప్రపంచానికి ఆదర్శమైన కుటుంబ లో పుట్టిన రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అరెస్ట్ చెయ్యడం నీ కండిస్తు కేంద్ర ప్రభుత్వం కేవలం భేటీ బచావో – భేటీ పడావో అనే నినాదంతో దేశంలో మహిళల్ని అణచివేయడం జరుగుతున్న పట్టించుకోని అధికారులు నేడు కేంద్ర ప్రభుత్వనికి ఏజెంట్ లుగా పనిచేయడం బాధాకరమైన విషయం పేరుకు గొప్పలు చెప్పుకొంటున్న ఈ ప్రభుత్వం మసి పూసి మారేడు లా చేస్తుంది. అలాగే కొవ్వతూల తో ర్యాలీ నిర్వహించి చనిపోయిన మనీషా కి నివాళి అర్పించారు.

ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపాలిటీ కౌన్సిలర్ గాజుల భాస్కర్ , బ్లాగ్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడేపు సారంగపాణి , మొలుగు దిలీప్ , భోగం వెంకటేష్ , కల్లేపల్లి వినోద్, ఫిరోజ్ మొహమ్మద్, ప్రశాంత్ తెలకుంట్ల , శ్యామ్ , అభిషేక్ , మణినిప్ , అఖిల్ , తేజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enable Notifications    Ok No thanks