ఇల్లందకుంట మండల రాష్ట్రోపాధ్యాయ సంఘం (STUTS) నూతన కార్యవర్గం ఎన్నిక

Share the news
  • 29 న జరిగే మహాధర్నా ను విజయవంతం చేయండి.

  • ఇల్లందకుంట మండల రాష్ట్రోపాధ్యాయ సంఘం (STUTS) నూతన కార్యవర్గం.

తేది 19.12.2020 శనివారం రోజున ఇల్లందకుంట మండల కేంద్రం లో రాష్ట్రోపాధ్యాయ సంఘం (STUTS) మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండల శాఖ అధ్యక్షునిగా ఉన్నత పాఠశాల టేకుర్తి కి చెందిన నెరుపటి ఆనంద్ (అంకూస్). ప్రధాన కార్యదర్శిగా ప్రాథమికోన్నత పాఠశాల శ్రీరాములపల్లి కి చెందిన యం నాగరాజు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా యం కొమురెల్లి, కందుగుల రవి, మరియు అంతోటి రమాదేవి, కార్యదర్శులుగా యం బాలరాజు, గూడెపు సుధాకర్, యం.డి. అన్వర్ మహిళా కార్యదర్శులుగా వి శాంతమ్మ , బి స్వప్న మరియు జి.పద్మ జిల్లా కౌన్సిలర్ గా గాలేటి తిరుపతి రెడ్డి, శెట్టి రాజమౌళి, కోశాధికారిగా రాచపల్లి స్వామి, ఫైనాన్స్ కమిటి సభ్యులు గా దొంత రవి, వి.శ్రీనివాస్, లు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల అధికారిగా పురుశోత్తం మూర్తి, పరిశీలకులుగా రజాక్ పాషా వ్యవహరించారు.
నూతన కార్యవర్గాన్ని రాష్ట్రోపాధ్యాయ సంఘం (STU) జిల్లా అధ్యక్షుడు శ్రీ కట్టా రవీంద్రా చారి మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ శనిగరపు రవి గారు అభినందించారు.

నెరుపటి ఆనంద్ (అంకూస్) – అధ్యక్షులు
యం.నాగరాజు – ప్రధాన కార్యదర్శి

ఉపాధ్యాయుల సమస్యల సాధనకై తేది 29 డిసెంబర్ 2020న ధర్నా చౌక్, హైదరాబాద్ లో జరిగే మహాధర్నా లో ఉపాధ్యాయులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని , ఉపాధ్యాయ, ఉద్యోగుల హక్కుల కొరకు కలసి కట్టుగా పోరాడి సాధించుకోవాలని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enable Notifications    Ok No thanks