Site logo

కేసిఆర్ కరీంనగర్ లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్న హామీ వెంటనే నెరవేర్చాలి – కాంగ్రెస్ నేతలు

ఈ రోజు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట పట్టణ కేంద్రంలో కరీంనగర్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది.
పత్తి కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ “2014 సంవత్సరం లో సీఎం కేసిఆర్ కరీంనగర్ మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తా అని చెప్పిన కేసిఆర్ కి గుర్తు చేస్తూ 2017 లో కరీంనగర్ జిల్లా నడి బొడ్డున మెడికల్ కాలేజీ కోసం టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆమరణ దీక్ష చేస్తే నిర్దాక్షిణ్యంగా అధికార బలం పోలీస్ బలగాలతో దీక్షను భగ్నం చేయించి నేటి వరకు కూడా మెడికల్ కాలేజీ నిర్మాణ చెయకుండా కరీంనగర్ జిల్లాను డల్లాస్, లండన్ లా చేస్తా , స్మార్ట్ సిటీ చేస్తా అని సవితి తల్లి ప్రేమ చూపిస్తూ దొంగ ప్రేమతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలను మోసం చేస్తున్నారనీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు మంత్రులు ఉన్నప్పటికీ అందులో వైద్య అరోగ్య శాఖ మంత్రి గారు, స్వయాన సీఎం కుమారుడు కే టీ ఆర్ ప్రాతినిథ్యం వహిస్తు ఉన్నాకూడా జిల్లాకు మెడికల్ కాలేజీ విషయంలో ఇంత నిర్లక్ష్యం వహిస్తు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల నోట్లో మన్నుకొడుతున్నర నీ. అలాగే స్వయాన తెలంగాణ వైద్య అరోగ్య శాఖ మంత్రి గారి సొంత నియోజకర్గo హుజరాబాద్ లోని జమ్మికుంట మరియు హుజరాబాద్ ప్రభుత్వ దవాఖాన లల్లో ఇద్దరు దంత వైద్యులను సూపరిండెంట్ లుగా నియమించారు. దంత వైద్యానికి సంబంధించి ఎటువంటి వైద్యం చెయ్యక పోయిన మిగతా వ్యాధుల విషయం లో దంత వైద్యులకు అవగాహన లేకపోయినా ఇద్దరు భార్య భర్తలను సూపరిండెంట్ లు గా నియమించారు వీరు సిబ్బంకి గత 5 నెలలుగా కరోనా విపత్కర పరిస్థితుల్లో జీతాలు ఇవ్వకుండా వారి పరిస్థితి రెక్కాడితే గాని డొక్కాడని స్థితి నేడు ఉందని” అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కసుబోజుల వెంకన్న , సాహెబ్ హుస్సేన్ , రావుల సారంగపాణి,యం.డి సలీం, సాయిని రవి, అయోధ్య , సజ్జూ, దీక్షిత్, పోతిరెడ్డి మల్లయ్య, దరుగుల రాకేష్, యగ్గని శ్రీనివాస్, ఇమ్రాన్ , పుల్లూరి సదానందం,కండే మహేందర్,ముద్ధమల్ల
రవి, సన్ని,బోగం మురళి, మహేంద్ర చారి, బొల్లి వెంకటేష్, జఫాన్ , బోయిని మధు తదితరులు పాల్గొన్నారు.

Comments

  • No comments yet.
  • Add a comment