Site logo

బాధ్యతలు చేపట్టిన జమ్మికుంట మున్సిపాలిటీ పాలక వర్గం. ఈటెల ఆధ్వర్యంలో పదవి స్వీకరణ చేసిన చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ డేశిని స్వప్న

కరీంనగర్ జిల్లా
జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవి స్వీకరణ మహోత్సవానికి హాజరైన ఈటెల
జమ్మికుంట మున్సిపాలిటీ నూతన పాలక వర్గ పదవీ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల. జమ్మికుంట మున్సిపాలిటీ 30 కి గాను 22 కౌన్సిలర్ల ను గెలిచిన టి.అర్.ఎస్.
చైర్మన్ గా తక్కల్లపల్లి రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ గా దేషిని స్వప్న మరియు పాలక వర్గ పదవీ స్వీకారం.

తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల.రాజేందర్ సమక్షంలో జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్ గా తక్కలపల్లి రాజేశ్వరరావు పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న కనుమల్ల.విజయ, మాజి శాసనసభ సభ్యులు ఆరేపల్లి.మోహన్.

అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ
ప్రజల ఆశీర్వాదం తో గెలిచారు..గెలిచిన అభ్యర్థులు కొందరే ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటారు. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ లకు ఇద్దరికి నాయొక్క శుభాకాంక్షలు..
రాజకీయా నాయకులకు ఎపుడు ప్రజల్లో చిన్న చూపు ఉంటుంది. పాత పాలక వర్గానికి హుజురాబాద్, జమ్మికుంట రెండు పట్టణాలకు అద్దంలా తీర్చిదిద్దడానికి ఎంతో డబ్బులు వెచ్చించి అభివృద్ధి చేసుకున్నాం. జమ్మికుంట ప్రజలకు త్రాగునీరు ఇచ్చిన ఘనత మన పార్టీదే.. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక హుజురాబాద్ కు 50, జమ్మికుంట కు 40 కోట్లు మొదటగా మంజూరు చేసుకొని జీవో మనమే తెచుకున్నాం. నా మంత్రి పదవి ముగుస్తుందనగా హుజురాబాద్ కి 40 కోట్లు, జమ్మికుంట కు 40 కోట్లు ఇచ్చిన.. ఆ డబ్బులు ఇంకా మిగిలే ఉన్నాయి.. సపాయి కార్మికుల కోసం హుజురాబాద్, జమ్మికుంట రెండు మున్సిపల్లో డబ్బులు తెచ్చి డిపాజిట్ చేయించిన ఘనత మనదే.. ప్రజలకు వచ్చిన సమస్యను పరిష్కరించే విధముగా పాలక వర్గం ఉండాలి.
ఓట్ల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలి తప్పా నాకు ఓటు వేయలేదు అని చూడకుండ ప్రజల అందరి సమస్యలు పరిష్కరించాలి.
పందుల సమస్య, రోడ్ల సమస్య, త్రాగునీరు సమస్యలు అన్ని తీర్చే బాధ్యత మున్సిపల్ పాలకవర్గానిదే..
పేద కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందిచేలా జమ్మికుంట పట్టణములో త్వరలో విద్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం..
హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో విద్య, వైద్యం కొరత లేకుండా చూస్తాం..
దేనికైనా తెచ్చి పెట్టె బాధ్యత నాది.. దానిని ప్రజలకు చేరవేసే బాధ్యత పాలక వర్గానిది..
హుజురాబాద్, జమ్మికుంట రెండు నగరాలను హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా అభివృద్ధి చేసే బాధ్యత నాది..
పాలకవర్గానికి ఒకటే చెప్తున్న గ్రూపు రాజకీయాలు, వ్యత్యాసాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా పని చేయాలని పాలకవర్గాన్ని కోరారు.

Comments

  • No comments yet.
  • Add a comment