భక్తి శ్రద్ధలతో బిజీగీర్ షరీఫ్ గ్రామంలో గ్యారిమి షరీఫ్ పండుగ వేడుకలు

Share the news

ముస్లింల అతి పవిత్రమైన మాసం రబ్బి ఉల్ సానిలొ ముస్లింలు ఎంతో పవిత్రంగా
జరుపుకునే పండుగలలో గ్యారిమి షరీఫ్ కు ప్రత్యేక స్థానం ఉంది…
క్రీ॥శ॥ 1078( 1రంజాన్ 471 హీజ్రి) సంవత్సరంలో ఇరాక్ దేశంలోని
జిలాన్ గ్రామంలో హజ్రత్ అబుసాలెహ్ ముసా మరియు సయ్యదా
– అబుల్ ఖైర్ ఫాతిమా దంపతులకు హజ్రత్ గౌసే ఆజమ్ షేక్ అబ్దుల్
– ఖాదర్ జిలాని రహ్మతుల్లా అలై అనే కుమారుడు జన్మించాడు.
చిన్న తనంలోనే తండ్రి పోగొట్టుకున్న హజ్రత్ గౌసే ఆజమ్ తల్లి
సంరక్షణలో పెరిగి అల్లాహ్ సందేశాలు, ఖురాన్ బోధనలను తల్లి వద్దే నేర్చుకున్నారు. 18 సం”ల వయసులో ఆధ్యాత్మిక చదువు
కోసం ఆ రోజుల్లో చదువుల నిలయంగా పిలువబడే బాగ్దాద్ నగరానికి చేరుకొని బాగ్దాద్ లో విద్యను అభ్యసిస్తూ అల్లాహ్ సందేశాలను ఇస్లాం
బోధనలు ఖురాన్ లోని సూక్తులను ప్రజలకు తెలియజేస్తూ తాను నేర్చుకున్న
విద్యబుద్ధులను ఇతరులకు బోధిస్తు అల్లాహ్ వద్ద మహబుబె సుభానిగా
పిలువబడ్డారు. ఆయన జీవితకాలంలో ప్రదర్శించిన మహిమలు బాధితుల
పట్ల చూపిన కరుణ దయ వల్ల ఎందరో సుఖజీవనం గడపగలిగారు.
హజ్రత్ గౌసే ఆజమ్ షేక్ అబ్దుల్ ఖాదర్ జిలాని క్రీ||శ|| 1167(11 రబ్బి ఉల్ సాని561 హీజ్రీ)లో భగవంతుడిలో లీనమైనారు. ఆయన స్మారకార్థం ప్రతి సంవత్సరం
ముస్లింలు జరుపుకునే పండుగే గ్యారీమీ షరీఫ్….
గ్యారీమీ షరీఫ్ వేడుకలు సందర్భంగా బిజిగిర్ షరీఫ్ గ్రామంలో ఆదివారం రోజున సాయంత్రం ఫాతేహ ఖ్వాని కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జెండా ఊరేగింపు స్థానిక సంధల్ గద్దె నుండి హజ్రత్ గౌసే పాక్ జెండా గద్దె వరకు ముస్లిం యువకులు భక్తి శ్రద్ధలతో అల్లాహ్ కీర్తనలతోమొల్లపల్లెలో ఊరేగించి స్థానిక దర్గా జెండా గద్దె వద్ద ప్రతిష్ఠించారు.


అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ముస్లింల మత గురువు మౌలానా మొహమ్మద్ నౌమాన్ హష్మీ గారు, మౌలానా గులాం యాసీన్ గారు, మొహమ్మద్ ఖాజా పాషా గారు ధార్మిక తేజోమయ
ఉపన్యాసం చేసినారు…
ఈ కార్యక్రమంలో బిజీగీర్ షరీఫ్ దర్గా కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ఇక్బాల్, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం, సంయుక్త కార్యదర్శి మొహమ్మద్ జాఫర్,ఆర్గనైజింగ్ కార్యదర్శి మొహమ్మద్ అబ్దుల్ ఆషూ కోశాధికారి మొహమ్మద్ మహమూద్ సభ్యులు : సాదక్, సర్వర్, హమీద్, జాఫర్, తాజ్, బిజిగిరి షరీఫ్ గ్రామ కో ఆప్షన్ సభ్యులు మొహమ్మద్ నయీముద్దీన్ తో పాటు ముస్లిం యువకులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enable Notifications    OK No thanks