శైలజా రెడ్డి అల్లుడు – మూవీ రివ్యూ

Share the news

Jammikunta News – Entertainment News

విడుదల తేదీ : సెప్టెంబర్ 13, 2018
నటీనటులు : నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్, రమ్య కృష్ణ
దర్శకత్వం : మారుతీ
నిర్మాతలు : సితార ఎంటర్టైన్మెంట్స్
సంగీతం : గోపీ సుందర్
సినిమాటోగ్రఫర్ : నిజార్ షఫీ
ఇగోలా గోలతో నడిచే ఈ సినిమా లో రమ్య కృష్ణ, నాగ చైతన్య, అను వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు. కానీ కొంచెం మారుతి దర్శకత్వ లోపాలు కొట్టచ్చినట్టు కనపడింది. రమ్య కృష్ణ పాత్ర ఇంట్రడక్షన్ చేసిన విధానానికి పాత్ర నడిచిన విధానానికి కొంత చప్పగా ఉండటం, నాగ చైతన్య పాత్ర మరియు అత్త పాత్రల మధ్య తెలుగు ప్రేక్షకులు ఆశించిన కొంటె తనం లేకపోవడం కొంత లోపాలు. 
అయినప్పటికీ ఎక్కడా కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా నిలిచి మరిన్ని రోజులు వసూళ్లు రాబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 
మనజమ్మికుంట రేటింగ్ : 3.5/5