రక్త దానం కొరకు మీ పేరు నమోదు చేసుకోండి – తోటి వారి ప్రాణాల్ని కాపాడండి

Share the newsప్రతి 2 సెకన్లకు ఎవరికో ఒకరికి రక్తము అవసరం ఉంటుంది. మీ రక్తం ఒకేసారి ఒకరికన్నా ఎక్కువ మందికి సహాయ పడుతుంది. ప్రమాదానికి గురైనవారికి, అకాల పక్వమైన పిల్లలకి, పెద్ద శస్త్రచికిత్స రక్తం కావలసిన రోగులకు, మీ రక్తాన్ని పరీక్ష చేసిన తరువాత నేరుగా ఉపయోగిస్తారు. గాయాలకు గురైన రోగులకి, రక్తహీనతతో బాధపడే రోగులకి మరియు ఇతర శస్త్రచికిత్స ఎర్ర రక్త కణాలు మాత్రమే కావలసి వస్తాయి. ఈ ఎర్ర రక్త కణాలు మీ రక్తం నుండి వేరుచేయబడతాయి. 

రక్తదానం గురించి అపోహలు
 • “దానము చేసిన తరువాత నానుంచి ఏదో పోయినట్టు మరియు నేను అలసి పోయినట్టు ఉంటుంది” – ద్రవ్యాలను మరియు మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే, మీ నుండి ఏదో పోయినట్టుగాని లేదా మీరు అలసి పోయినట్టుగాని ఉండరు
 • “నేను సాధారణ కార్యకలాపాలలో తిరిగి పాల్గొనలేను” –మిమ్మల్ని పాల్గొనవద్దని మీకు చెప్పినప్పటికీ, మీ అన్ని సాధారణ కార్యకలాపాలలో తిరిగి పాల్గొనవచ్చు
 • “నాకు రక్తం తక్కువ అవుతుంది” – మీరు డాక్టరు చేత దానం చేయడానికి, సరే అని అనిపించు కున్న తరువాత, దానం చేసిన తరువాత కూడా మీకు సరిపడా రక్తం ఉంటుంది
 • “నేను మద్యం సేవించలేను…” – తరువాత రోజు నుండి మీరు సేవించవచ్చు
 • “దానం చేసే సమయంలో నొప్పిగా ఉటుంది” – కాదు, మీకు ఎటువంటి నొప్పి కలుగదు
 • “నాకు తలతిరిగి సొమ్మసిల్లి పోవచ్చు” – రక్తం దానం చేసిన తరువాత,కొంతసేపు విశ్రాంతి తరువాత, మీరు సొమ్మసిల్లిపోరు లేదా అసౌకర్యం కలుగదు.
 • “నాకు ఎయిడ్స్ కలుగవచ్చు!” – లేదు! ఒకసారి ఉపయోగించి పారవేసే సిరంజ్ లను ఉపయోగించేలా మరియు క్రిములబారి నుండి దూరంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
 • “నా రక్తం సామాన్యమైనది. దానికి గిరాకి ఉంటుందని నేననుకోవడం లేదు” – అందుకే అరుదైన వాటి కన్నా మీ గ్రూపు రక్తానికే ఎక్కువ గిరాకీ ఉంటుంది.
రక్తం గురించి నిజాలు
 • రక్తం అనేది శరీర హృదయం, ధమనులు, సిరలు మరియు కేశనాళికల ద్వారా ప్రసరించి మీ ప్రాణాలను నిలబెట్టే ద్రవ్యము
 • రక్తం శరీర పోషణకి, విద్యుద్వాహక లవణాలు (electrolytes), హార్మోన్లని, విటమిన్లని, ప్రతిరక్షకణాలు (antibodies), వేడిని మరియు ఆమ్లజని ని తీసుకువెళతాయి
 • శరీరము నుండి వ్యర్థ పదార్థాలని మరియు కార్బన్డయాక్సైడ్ని రక్తం తీసుకువెళుతుంది
 • రక్తం, వ్యాధులను ఎదుర్కొని మరియు గాయాలకు ఉపశమనం కలిగించడానికి దోహదపడి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
 • మీ శరీర బరువులో, రక్తం సుమారు 7% వరకు ఉంటుంది
 • అప్పుడే పుట్టిన శిశువు శరీరంలో సుమారు ఒక కప్పు రక్తం ఉంటుంది
 • వ్యాధులను ఎదుర్కొనడంలో, తెల్ల రక్త కణాలు శరీరము యొక్క ప్రాధమిక సురక్ష.
 • ఒక రకమైన తెల్ల రక్త కణాలైన గ్రేన్యులొకైట్స్, సూక్ష్మక్రిములు (bacteria) వెదకి నాశనం చేయడానికి రక్త కణాల గోడల చుట్టూ తిరుగుతాయి
 • శరీర అవయవాలకి మరియు కణజాలానికి (tissues), ఎర్ర రక్త కణాలు ఆమ్లజనిని తీసుకు వెళతాయి
 • రెండు నుండి మూడు రక్త బిందువులలో, సుమారు ఒక బిలియన్ ఎర్ర రక్త కణాలు ఉంటాయి
 • ప్రసరణ వ్యవస్థలో, ఎర్ర రక్త కణాలు సుమారు 120 రోజులు జీవించి ఉంటాయి
 • రక్తపట్టికలు (platelets) రక్తం గడ్డకట్టడానికి దోహదపడతాయి మరియు లుకేమియా, ఇతర కేన్సర్ ఉన్నవారికి, జీవించడానికి అవకాశం కలిగిస్తాయి
రక్తం ఎందుకు దానం చేయాలి?
అన్ని జీవులు, రక్తం అనే ద్రవం మీద ఆధారపడి జీవిస్తాయి. రక్తం 60% ద్రవ భాగం మరియు 40% ఘన భాగంతో చేయబడింది. 90% నీరు మరియు 10% పోషకాలు, హార్మోన్లు మొదలగువాటితో తయారుచేయబడే, ద్రవ భాగమైన ఈ ప్లాస్మా, ఆహారము మరియు మందులు మొదలగువాటితో సులభంగా తిరిగి నింపబడుతుంది. కాని, ఆర్ బి సి ( ఎర్ర రక్త కణాలు), డ బ్ల్యు సి ( తెల్ల రక్త కణాలు) మరియు ప్లేట్ లెట్స్ కలిగి ఉండే ఘన భాగం పోతే, యధాతదంగా రావడానికి సమయము తీసుకుంటుంది.
మీరు ఇక్కడే అవసర పడతారు. దానిని తిరిగి యధాతదంగా రోగులయొక్క శరీరం నింపడానికి తీసుకునే సమయం, అతని/ఆమె ప్రాణాన్ని తీయవచ్చు. కొన్ని సమయాలలో, శరీరం తిరిగి నింపడానికి వీలైన స్థితిని ఏ మాత్రం కలిగి ఉండకపోవచ్చు.
రక్తాన్ని దానం మాత్రమే చేయవచ్చునని దానిన ఉత్పత్తి చేయలేమని మీకు తెలుసు. అంటే, రక్తం అవసరమయ్యే జీవితాలని మీరు మాత్రమే రక్షించవచ్చు.
ప్రతి సంవత్సరము భారత దేశంలో, 250 సి.సి. రక్తం గల 40 మిలియన్ యూనిట్లు కావాలసి ఉంటే,. అందులో, 500,000 యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది.See the 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enable Notifications    Ok No thanks