Site logo

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఓటరు దినోత్సవం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఓటరు దినోత్సవం

భారత ఎన్నికల సంఘం సూచనలమేరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ ,పి.జి కళాశాలలో ఘనంగా ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఓటు హక్కే వజ్రాయుధం వంటి సాధనమని 18 ఏళ్ళు దాటినా ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు పొంది ,ఎంపిక కార్డు తీసుకోవాలని ,భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు .ఎన్ ఎస్ ఎస్ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు కె.లిగారెడ్డి , బి.శ్రినివాసగౌడ్ లు  సమన్వయం చేసారు. కె.లింగారెడ్డి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల విద్యార్థినీ విద్యార్థులు ,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.రమేష్ , అధ్యాపకులు డాక్టర్ రజిత ,రాజేంద్రం ,సంజీవ రెడ్డి, సంధ్య, కిరణ్మయి ,డాక్టర్ రామారావు, ఓదెలు తదితరులు పాల్గోన్నారు ,ప్రజాస్వామ్య స్పూర్తిని చాటిన ఓటరు దినోత్సవంలో విద్యార్థులు కొత్తగా ఓటు హక్కు కార్డ్లు పొందడానికి ఉత్సాహం చూపారు.

Comments

  • No comments yet.
  • Add a comment