పట్టణమంతా జనగణమనతో హోరెత్తిన జమ్మికుంట – దేశానికి ఆదర్శంగా మారిన జమ్మికుంట ప్రజలు

Share the news

భారత దేశంలో అందరికి ఆదర్శంగా నిలిచిన జమ్మికుంట పట్టణం. 

దేశంలోనే మొట్ట మొదటి సారిగా జమ్మికుంటలో వినూత్నరీతిలో జాతీయగీతాన్ని ప్రతి రోజు పట్టణం మొత్తం ఆలాపించే విధంగా ఏర్పాట్లు చేసారు జమ్మికుంట స్థానిక పొలిసులు. జమ్మికుంట లోని అన్ని ప్రధాన కూడళ్ళలో మైకులు ఏర్పాటు చేసి ప్రతి రోజు ఉదయం 8 గంటలకు జనగణమన ప్రతి ఒక్కరు ఆలాపించే విధంగా ఏర్పాటు చేసారు స్థానిక సి.ఐ. ప్రశాంత్ రెడ్డి.సి.ఐ.ప్రశాంత్ రెడ్డి ఆలోచనతో కొత్త ఒరవడి 

సి.ఐ.ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి మరియు జాతీయభావం పెంపోదించేందుకు ఇది ఎంతో ఉపయోగ పడుతుందని, జాతీయ గీతం చాల మందికి రావడం లేదని అంతేకాక రోజు జాతీయగీతంతో పాటు దేశభక్తి గీతాలు కొంత సమయం వినడం వల్ల ప్రజల్లో ముఖ్యంగా యువకులు, మరియు విద్యార్థుల్లో దేశం అంటే అవగాహన, దేశంపట్ల గౌరవభావం పెరుగుతుందని తెలిపారు.


ఇక నుండి రోజు జమ్మికుంట లో జనగణమన  

ఈ రోజు ఉదయం జమ్మికుంటలోని 16 కూడళ్ళలో మైకుల ద్వార జనగణమణ ప్రజలందరూ ఆలపించే విధంగా చేసారు. స్థానిక గాంధీ చౌక్ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏర్పాట్లను ఒక రోజు ముందే కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ సందర్శించి పరిశీలించారు. ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం 2K రన్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మికుంట నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామ స్వామి, వైస్ చైర్మన్ శివ శంకర్, వార్డు కౌసిలర్స్, యువతీ యువకులు, విద్యార్థులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాగే నిత్యం జరపాలని స్థానిక ప్రజలకు పిలుపు నిచ్చారు.