జాతీయ ఓటర్ దినోత్సవాన్ని విజయవంతం చేయండి : తహసీల్దార్ నారాయణ

Share the news

National Voters Day arrangements by Jammikunta MRO

జాతీయ ఓటర్ దినోత్సవాన్ని విజయవంతం చేయండి జమ్మికుంట తహసిల్దార్ నారాయణ.

జాతీయ ఓటర్ దినోత్సవం కార్యక్రమం జమ్మికుంట మండలంలో విజయవంతంగా నిర్వహించేందుకు బూత్ లెవల్ అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలని తహసీల్దార్ నారాయణ సూచించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో బూత్ లెవల్ అధికారులు, వి,ఆర్,ఎ లతో  ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో గల్లంతైన ఓటర్లను గుర్తించి మళ్ళీ ఓటు నమోదు చేయాలని, అదేవిధంగా 18 సమత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కుపై అవగాహన కల్పించి ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. అప్పుడే ఓటర్ నమోదు కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. దానికి మండలంలోని బి,ఎల్,ఓ ప్రయత్నించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ కృష్ణ చైతన్య, సీనియర్ అసిస్టెంట్ వినోద్, ఆర్,ఐ లు, శ్రావణ్, శేఖర్, వి,ఆర్,ఎలు, బూత్ లెవల్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.