జమ్మికుంటలో డ్రైవర్స్ డే ఉత్తమ డ్రైవర్లకు సన్మానం చేసిన డిపో మేనేజర్

Share the news
Drivers Day at Jammikunta

హుజురాబాద్ డిపో మేనేజర్ ధరమ్ సింగ్ చేతుల మీదుగా జమ్మికుంట లో ఉత్తమ డ్రైవర్లకు సన్మానం


కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం స్థానిక గాంధీ చౌరస్తాలో హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ బి ధరమ్ సింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర డ్రైవర్స్ డే ను జరపడం జరిగింది ఈ సందర్భంగా డిపో మేనేజర్ ధరమ్ సింగ్ మాట్లాడుతూ మహాభారతంలో శ్రీకృష్ణుడు రథాన్ని ముందుకు ఎలా నడిపా డో అలానే డ్రైవర్ కూడా వాహనాన్ని ముందుకు నడిపి గమ్యాన్ని చేర్చ గలడని అన్నారు ఈ సందర్భంగా ఉత్తమ డ్రైవర్లను మేనేజర్ను తోటి డ్రైవర్లు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు ఇచ్చి సన్మానించారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ బి ధరమ్ సింగ్ sti జయలక్ష్మి జోనల్ అధ్యక్షుడు రవీందర్ సూపర్ ఇండెంట్ తిరుమల రావు డిపో సెక్రటరీ పి ఎల్ రావు తదితరులు పాల్గొన్నారు