జమ్మికుంటను సుందరంగా తీర్చిదిద్దడమే మా పాలకవర్గ లక్ష్యం- చైర్మన్ తక్కళ్లపల్లి

జమ్మికుంట పట్టణాన్ని సుందరం గా తీర్చిదిద్దడానికి మున్సిపల్ పాలకవర్గం కృషి చేస్తుందని దానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు అన్నారు.జమ్మికుంటను సుందరంగా తీర్చిదిద్దడమే మా పాలకవర్గ లక్ష్యం- చైర్మన్ తక్కళ్లపల్లి 1హుజురాబాద్ ఆర్ డి ఓ బెన్ షాలోం తో కలసి బుధవారం పట్టణంలో నూతనంగా వేస్తున్న తారురోడ్డు పనులను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి పట్టణంలో తారు రోడ్డు వేయుటకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.గాంధీ చౌరస్తా నుండి పాత మున్సిపల్ ఆఫీసు వరకు మరియు మటన్ మార్కెట్ రోడ్డు నుండి పోలీస్ స్టేషన్ వరకు వేసే తారు రోడ్డును ఆర్డీవో బెన్ షాలోం మున్సిపల్ కమిషనర్ అనిసూర్ రసీదు, కౌన్సిలర్ లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా గాంధీ చౌరస్తా చుట్టూ ఉన్న దుకాణ సముదాయాల ముందు పండ్లు, బజ్జీల బండ్ల యజమానులు వాటిని తొలగించాలని వారికి విజ్ఞప్తి చేశారు.
దుకాణాల యజమానులు మున్సిపాలిటీ సంబంధించిన స్థలంలో బండ్లు పెట్టుకున్న వారి వద్దనుండి నెలకి కిరాయిలు వసూలు చేస్తున్నారని,
ఆ దారిలో రైల్వే స్టేషన్ నుండి వచ్చే ప్రజలు, ప్రయాణికులకు చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని అన్నారు. ట్రాఫిక్ సమస్య రాకుండా అందరు సహకరించాలని కోరారు.
మున్సిపల్ స్థలం ఆక్రమించుకొని ఎలాంటి దుకాణాలు పెట్టవద్దని
అలాగే దుకాణాల ముందు రేకు షెడ్డ్ లను తొలగించుకోవాలని దుకాణ యజమానులకు తెలియజేశారు.
జమ్మికుంట పట్టణ అభివృద్ధి కొరకు చేస్తున్న అన్ని పనులకు మున్సిపల్ పాలకవర్గానికి ప్రజలు వ్యాపారులు సహకరించాలని చైర్మన్ రాజేశ్వరరావు కోరారు.జమ్మికుంటను సుందరంగా తీర్చిదిద్దడమే మా పాలకవర్గ లక్ష్యం- చైర్మన్ తక్కళ్లపల్లి 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *