గురుకుల పాఠశాల తరలించారని నిరసన తెలుపుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రి ఈటల రాజేందర్  దిష్టిబొమ్మ దగ్ధం

Share the news

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కేంద్రంలో గురుకుల పాఠశాల ఏర్పాటును హుజురాబాద్ కు తరలించారని SFI, NSUI, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రి ఈటల రాజేందర్ దిష్టిబొమ్మ దగ్ధం.

గురుకుల పాఠశాల ఏర్పాటు అంశంలో మాట తప్పిన మంత్రి ఈటల రాజేందర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.

విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మంత్రి గారికి వీణవంక మండలం పైన ఉన్నటువంటి వివక్ష ఎంత స్థాయిలో ఉందో నిరూపించుకుంటూనే ఉన్నారు. ఆయన మొండి పట్టుదల వధులకుండా ఒక అధికార యంత్రాంగంలో మంత్రి పదవిలో ఉంటే ప్రాంతాల అభివృద్ధి ఆయన అనుకున్నట్టు జరుగుతుందని ఈ రోజు నాయకులు ఏం చేయాలనుకుంటే అదే నడుస్తుందని ఈటల రాజేందర్ గారు చేతల రూపంలో ఈరోజు చూపెట్టిన పరిస్థితి మండల కేంద్రంలో ఇటువంటి చర్యలు అభివృద్ధి నిరోధకంగా ఉన్నాయని అన్నారు.

గత పదిరోజుల నుండి విద్యార్థి సంఘ నాయకులు, స్థానిక ప్రజలు, మేధావులు ఏదో ఒక రూపంలో కేంద్రంలో ప్రభుత్వ గురుకుల పాఠశాల పెట్టాలని తమ అభిప్రాయాలను తెలియజేస్తున్న కనీసం రాష్ట్ర ప్రభుత్వ అధికార మంత్రిగారు శ్రద్ధ చూపక పోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. భవన సముదాయాలు లేవు అంటేవిద్యార్థి సంఘ నాయకులు భవనాలను చూపెట్టిన ఏదో ఒక వంక తోటి అసలు ఇక్కడ గురుకుల పాఠశాలలు పెట్టకుండా అనేకమైన అటువంటి కారణాలు చెబుతూ హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలో అది కొనసాగిస్తూ అక్కడికె పరిమితం చేసి ఆయన పేరు తెచ్చుకోవడం కోసం ఈరోజు వీణవంక మండల కేంద్రానికి అన్యాయం చేయడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు. ఈ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల ఓట్లతో గెలిచిన అటువంటి మంత్రి గారు ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధి కాకుండా వారి సహాయ శక్తుల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వీణవంక మండల కేంద్రం మంత్రి గారికి ఏం అన్యాయం చేసిందని వారు అన్నారు. ఇప్పటికైనా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయకపోతే కచ్చితంగా మంత్రిగారి ఇంటిని ముట్టడిస్తామని అదేవిధంగా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు..

ఈ కార్యక్రమంలో SFI జిల్లా అధ్యక్షుడు అప్పని హరీష్ వర్మ,NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి MD ఇమ్రాన్,ఆ సంఘాల నాయకులు ఫయాజ్, వెంకటేష్, సిద్దు,అనిల్,సాయి, నాగరాజు, సంతోష్,నిఖిల్,కుమార్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enable Notifications    OK No thanks